నగరవనాల అభివృద్ధికి కేంద్ర నిధులు: పవన్‌

85చూసినవారు
నగరవనాల అభివృద్ధికి కేంద్ర నిధులు: పవన్‌
AP: రాష్ట్రంలో 11 నగరవనాల అభివృద్ధికి కేంద్ర నిధులు మంజూరయ్యాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 11 నగరవనాల ఏర్పాటుకు రూ.15.4 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరులో 2 చోట్ల నగరవనాలు.. శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండలో నగరవనాలు.. నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 50 నగరవనాల పనులు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్