నల్లమిల్లికి చంద్రబాబు కీలక హామీ

577చూసినవారు
నల్లమిల్లికి చంద్రబాబు కీలక హామీ
టీడీపీ నుంచి అనపర్తి టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ నేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది. దాంతో స్వతంత్రంగా పోటీకి సిద్ధమైన నల్లమిల్లితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనపర్తిలో బీజేపీ గెలవదని నల్లమిల్లి సూచించారట. అనపర్తి సీటు వ్యవహారంపై తాను కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు చెప్పినట్లు నల్లమిల్లి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్