AP: రాష్ట్రంలో బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్పందించారు. ‘కెమెరా ముందు బెల్టు షాపులు నిర్వహించవద్దంటారు. కానీ రాష్ట్రంలో బెల్టు షాపులు అఫీషియల్‌గా నడుస్తున్నాయి. చంద్రబాబువి అన్ని సొల్లు కబుర్లే. ఎక్సైజ్ అధికారులే బెల్టు షాపులు ప్రోత్సాహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు బెల్ట్ షాపుల నిర్వాహకులు డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులు చేయిస్తున్నారు.’ అని అంబటి వ్యాఖ్యానించారు.