బుడమేరు వరదలకు వైఎస్ కుటుంబమే కారణమని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి వియ్యంకుడి వల్లే బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు ఆగిపోయిందని విమర్శించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు. నాడు ఆ ప్రాజెక్టు కట్టి ఉంటే.. నేడు బుడమేరుకు ఇంత స్థాయిలో వరద వచ్చేది కాదని మండిపడ్డారు. బుడమేరు వాగు వలన చాలా మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.