ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. విజన్ 2047 రూపకల్పనపై నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం చర్చించనున్నారు. డాక్యుమెంట్ రూపకల్పనపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ సమావేశం నిర్వహించింది.