నానబెట్టిన బాదం పప్పు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన బాదం తొక్కలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు నానబెట్టిన బాదంను తొక్కతో సహా తినడం చాలా మంచిది. బాదం తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక ప్రమాదాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.