'సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35' 5జీ స్మార్ట్ ఫోన్‌పై కస్టమర్లకు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ బేస్ మోడల్ అసలు ధర రూ.19,999 కాగా, అమెజాన్‌లో ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. పాత స్మార్ట్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.