విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో అందరికి దర్శనమిస్తున్నారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తున్నారు.