టీడీపీ అధినేత చంద్రబాబువి బూటకపు మాటలని, నయ వంచనకు ప్రతిరూపం అతనేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు కుటిల వాగ్ధానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేస్తామని ప్రకటించిన ఆయన.. ప్రజల్లో తిరుగుబాటును చూసి యూటర్న్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గాలానికి వాలంటీర్లు పడబోరని స్పష్టం చేశారు.