ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో జమిలి ఎన్నికల దిశగా కసరత్తు వేగవంతం అవుతోంది. ఇదే సమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఇదే సమయంలో జిల్లాల వారీగానూ కొత్త ప్రణాళికలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఈ దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ముందుగా తన ఆలోచనలను వివరించి.. జిల్లా స్థాయిలో పాలనా పరంగా నిర్ణయాల అమలు కోసం జిల్లా కలెక్టర్ల సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశాల ద్వారా అధికార యంత్రాంగానికి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.