సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. అయితే ఆయన ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. కాగా తన చివరి తీర్పులో పలు రాష్ట్రాలు బుల్డోజర్ న్యాయం పేరుతో తీసుకుంటున్న చర్యలను ఖండించారు. బుల్డోజర్ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు.అయితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పులేదని సూచించారు.