తమిళనాడుకు చెందిన 23 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నేడుంతీవు ద్వీపం సమీపంలో చేపలు పడుతుండగా తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారని శ్రీలంక నేవీ పెట్రోలింగ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని కంకేసంతురై నేవల్ క్యాంప్‌కు తరలించి అక్కడి నుంచి జాఫ్నా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.