చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానికి తప్పిన ప్రమాదం

591చూసినవారు
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానికి తప్పిన ప్రమాదం
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా ఆయన కారును గుంటూరు వద్ద టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను క్షేమంగా ఉన్నానని నాని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్