చంద్రగిరి: భాకరాపేట అడవుల్లో పది ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
చంద్రగిరి మండలం భాకరాపేట సమీపంలోని అడవుల్లో 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక అటవీ అధికారులతో కలిసి శ్రీవారి మెట్టు నుంచి కూంబింగ్ చేపట్టారు. చీకటీగల కోన వద్ద ఎర్ర చందనం దుంగలను మోసుకువస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.