ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబైకి చేరుకున్నారు. జల్గావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు ఆయన వచ్చారు. రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.