సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ, రాజకీయ నాయకులంతా శనివారం నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆయన కుమారుడు నారా రోహిత్ పెళ్లి సరిగ్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడాయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం, ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టేసింది. కాగా, 1994 నుంచి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు.