మహిళ మెడలో బంగారు గొలుసు చోరీపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ ఉలసయ్య తెలిపారు. ఆయన వివరాల మేరకు సంతపేటలో చిల్లర దుకాణం నడుపుతున్న జ్యోతి అనే మహిళ వద్దకు ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి సిగరెట్ కావాలని అడిగారు. సిగరెట్ తీయడానికి వంగినప్పుడు మెడలో ఉన్న రూ. 1. 60 లక్షలు విలువైన మాంగళ్యం, బంగారు గొలుసు చోరీ చేశారు. ఎస్ఐ ప్రసాద్ బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆదివారం ఆయన తెలిపారు.