చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని అధికారులు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఎస్ఆర్ పురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో ప్రతి గ్రామంలో పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం అధికారుల దగ్గర ప్రతిజ్ఞ చేయించారు.