పుత్తూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో సోమవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు కోలాహాలంగా నిర్వహించినట్లు ఏజీఎం కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ మధుల హాజరైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏజీఎం కిషోర్ మాట్లాడుతూ భోగి భాగ్యాలను, సంక్రాంతి సిరిసంపదలను, కనుమ కొత్త కాంతులను కలుగజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, ఏ ఓ రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.