కోలాహలంగా నగర సంకీర్తన వేడుకలు

75చూసినవారు
కోలాహలంగా నగర సంకీర్తన వేడుకలు
బైరెడ్డిపల్లెలో శనివారం సాంప్రదాయ కళల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నగర సంకీర్తన వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సంకీర్తనలను ప్రారంభించారు. సుమారు 50 మంది కళాకారులు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి గోవింద నామాలు జపిస్తూ, రామనామ సంకీర్తనలు చేశారు.

సంబంధిత పోస్ట్