బిజెపి ఆవిర్భావ దినోత్సవం

76చూసినవారు
బిజెపి ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గుర్రంకొండ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు రామాంజులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతంతో, దేశ అభివృద్ధికి శ్రమిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతిర్ల శ్రీనివాసులు, రామ్మూర్తి, శివ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్