పులిచెర్ల: పంట పొలాలపై ఏనుగుల దాడులు

67చూసినవారు
పులిచెర్ల: పంట పొలాలపై ఏనుగుల దాడులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో పంట పొలాలపై గజరాజుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు పంట పొలాల వైపు వెళ్లి నీటి పైపులు, రాతి కూసాలను, మామిడి చెట్లను విరిచేసాయి. దీనితో ఏమి చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకున్నారు. పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్