తిరుపతి: ఏపీ హైకోర్టులో చెవిరెడ్డికి షాక్!

75చూసినవారు
తిరుపతి: ఏపీ హైకోర్టులో చెవిరెడ్డికి షాక్!
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. చెవిరెడ్డిపై గత ఏడాది నవంబర్‌లో పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్