చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని బొమ్మసముద్రం హైవే ప్రాంతం అంధకారంలో ఉందని స్థానికులు మంగళవారం తెలిపారు. బొమ్మసముద్రం నుంచి కాణిపాకంకు వెళ్లే రహదారిలో లైట్లు పూర్తిగా వెలగడం లేదని చెప్పారు. రాత్రుల్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నేషనల్ హైవే అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన లైట్లను మార్చాలని కోరుతున్నారు.