చిత్తూరు అంబేడ్కర్ భవన్లో 208 మంది విభిన్న ప్రతిభావంతులకు 218 కృత్రిమ కాలును కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ, ఫ్రీడమ్ టెస్ట్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలను పంపిణీ చేయడం సంతోషమన్నారు. వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.