రొంపిచెర్ల పోలీసుస్టేషను చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి శనివారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఎస్ఐను అదేశించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేసుకోవాలన్నారు. ఎన్నికలలో రౌడీ షీటర్లు పాల్గొంటే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలలో ఘర్షణ జరిగే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు.