చిత్తూరు పుర ప్రజల దాహార్తిని తీర్చడానికి అమృత్ పథకం అనుసంధానంగా ఏషియన్ మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు అడవిపల్లి రిజర్వాయర్ కు ఇచ్చిన నిధులతో పైపు లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నీరు అందించాలిసిందిగా శుక్రవారం అధికారులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సంధర్బంగా అధికారులు స్పందిస్తూ పైపు లైన్ పనులు ప్రారంభించాలంటే నేషనల్ హైవే అధికారుల అనుమతులు కావాలని కోరారు.