కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. పైగా రుచికరంగానూ ఉంటాయి. ప్రత్యేకించి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్లను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది. పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగడంతో వారి బిడ్డలకు పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్ యాసిడ్‌ను పెంచుతుంది.