May 03, 2024, 16:05 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
May 03, 2024, 16:05 IST
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా యువజన సంఘ జెండాను ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య ఎగరవేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చంద్రగిరి ఉదయ్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాచర్ల అంజి, అస్లాం, రాజు, విజయ్ పాల్గొన్నారు.