అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గంగాధర నెల్లూరులో ఆయన మాట్లాడుతూ దేశం, ప్రజల గురించి తపించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అమిత్ షా ఇప్పటికైనా తన తప్పుని తెలుసుకొవాలని హితవు పలికారుపలికారు. మహోన్నత వ్యక్తిని పదేపదే అవమానించడం సరైన పద్ధతి కాదని అన్నారు.