మరింత సులభంగా PF విత్‌డ్రా: EPHO

76చూసినవారు
మరింత సులభంగా PF విత్‌డ్రా: EPHO
తమ ఖాతాదారుల నగదు విత్‌డ్రాపై EPFO కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై డబ్బు విత్‌డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. కోటిన్నర మందిపై ఏడాదిగా నిర్వహించిన ట్రయల్స్ సక్సెస్ కావడంతో ఈ సౌకర్యం అందరికీ కల్పిస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్