మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు

64చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గుర్రాల కొండపై ఆయన నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. గుర్రాల కొండపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గెస్ట్ హౌస్‌ను ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కొండపై తాను నిర్మించిన గెస్ట్‌హౌస్ ప్రభుత్వ భూమి కాదని కేతిరెడ్డి గతంలో సవాలు చేశారు.

సంబంధిత పోస్ట్