ఏపీలో రేపు మోస్తరు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో, చెట్ల కింద రైతులు ఉండరాదని పేర్కొంది.