బెంగళూరుకు చెందిన Dazeinfo మీడియా అండ్ రీసెర్చ్ సంస్థ సీఈఓ అమిత్ మిశ్రా తన ఆరోగ్య సమస్యల గురించి లింక్డ్ఇన్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కఠినమైన పని ఒత్తిడితో తన రక్తపోటు 230కి పెరిగి, ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నాడు. ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముఖ్యమని, పని ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.