కర్ణాటక హైకోర్టు రాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్-హైలింగ్ సంస్థలకు భారీ షాక్ ఇచ్చింది. బైక్ టాక్సీ సేవలను ఆరు వారాల్లోపు పూర్తిగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సేవలపై అనుమతుల విషయంలో స్పష్టత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించకపోతే మరింత కఠిన చర్యలు ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం ఈ న్యూస్ బైక్ సేవలు ఉపయోగించేవారికి ఆందోళన కలిగిస్తుంది.