పాకిస్థాన్ మాజీ టెస్ట్ క్రికెటర్ ఫరూఖ్ హమీద్(80) గురువారం దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. 1964లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తన ఏకైక టెస్టు ఆడిన హమీద్, ఆ మ్యాచ్‌లో ఇయాన్ చాపెల్ వికెట్ తీసుకున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా 1961-70 వరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 25.21 సగటుతో 111 వికెట్లు తీశాడు. ఫరూఖ్ మృతిపట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.