బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. 8 మంది దుర్మరణం!

50చూసినవారు
బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లాలోని కుందాప్రదేశ్‌లో గ్రామంలో బావిలో పడి ఎనిమిది మంది మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాడుబడిన బావిని శుభ్రం చేస్తుండగా.. మెదట ముగ్గురు జారిపడ్డారు. వారిని రక్షించడానికి మరో ఐదుగురు వెళ్లగా.. వారు కూడా గల్లంతయ్యారు. దీంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రెండు మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్