కుప్పం పట్టణం నుండి అమరావతీ కాలనీకి ఆర్టీసీ బస్సు సర్వీసును గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వంలో కుప్పం అభివృద్ధి కుంట పడిందని, ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని అన్నారు. మునిరత్నం, డాక్టర్ సురేష్, శివశంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.