కుటుంబ కలహాలతో ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన తంబళ్లపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు. మండలంలోని రెడ్డి కోటకు చెందిన శివశంకర్ భార్య పి లక్ష్మీదేవి28 వ్యవసాయ పనులకు వెళ్లడం లేదని భర్త మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న బూటాక్స్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఘటనపై తంబలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.