కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లయింగ్ చేస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.