ఓటర్ వెరిఫికేషన్ కు సంబంధించి రెండు రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రెండో రోజు ఆదివారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఓటు కోసం ముందస్తుగా ఈ క్యాంపులో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరికి అర్హత వచ్చిన తర్వాతే అధికారికంగా ఓటర్లుగా నమోదు చేస్తారు అని అధికారులు తెలిపారు.