
మదనపల్లి శ్రీవారి నగర్ లో పడకేసిన పారిశుధ్యం
మదనపల్లి శ్రీవారి నగర్ లో డ్రైనేజీ కాలువలు లేక ఇళ్ల మధ్యనే కలుషిత నీరు నిల్వ ఉంటోంది. దోమలు ప్రబలి జ్వరాల బారిన పడుతున్నామని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బుధవారం కేశవ, సుధాకర్, రమణయ్య ఆరోపించారు. వెంటనే తమ సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు.