
మదనపల్లి: విషాదం.. బైక్ ఢీ కొని 2 కాళ్లు విరిగిన ఘటన
ఎన్ఎస్ పేటకు చెందిన భాగ్యమ్మ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి.. వైద్యం చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆసుపత్రి వద్ద ఉండే రోడ్డు పైకి వచ్చింది. ఆటో కోసం వేచి ఉండగా వేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కాళ్లు విరిగిపోయాయి. బాధితురాలిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.