రామసముద్రం మండలంలో వైభవంగా నిమజ్జనాలు

74చూసినవారు
రామసముద్రం మండలంలోని బజారు వీధి తిరుమలరెడ్డిపల్లె, గుంతలపేట, మట్లవారిపల్లె, మినికి నరసాపురం, ఊలపాడు దిన్నిపల్లె, మానేవారి పల్లె పెద్దకురప్పల్లె గ్రామాల్లో బొజ్జ గణపయ్య నిమజ్జనం సోమవారం రాత్రి నిర్వహించారు. యువకులు ఉత్సాహంతో రంగులు చల్లుకుంటూ స్వామివారిని ఊరేగించారు. గణపతి బొప్పా. మోరియా అంటూ నినాదాలు చేశారు. భక్తులకు అన్నదానం చేసి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్