మదనపల్లి పట్టణంలో సుమారు 47 వేల మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. మదనపల్లి సిటిఎం రోడ్డులో మంగళవారం బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు వారి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.