నగరి నియోజవర్గంలో పుత్తూరు మండలంలోని స్వామి వీధి జ్ఞాన జ్యోతి స్కూల్ వద్ద సోమవారం విద్యుత్ స్తంభం పడిపోయింది. అయితే సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.