చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం పై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరయ్యారు.