పుత్తూరు: ధ్యానంతో శారీరక ఆరోగ్యం

65చూసినవారు
పుత్తూరు: ధ్యానంతో శారీరక ఆరోగ్యం
ధ్యానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం పెరుగుతుందని ప్రిన్సిపల్ చంద్రమౌళి తెలియజేశారు. ఈ సందర్భంగా నగరి నియోజక వర్గం పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇటీవల ఐక్య రాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం అలవర్చుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్