'క్రీడలు మానసిక వికాసానికి అవసరం'

957చూసినవారు
'క్రీడలు మానసిక వికాసానికి అవసరం'
అంగరంగ వైభవంగా జగనన్న జన్మదిన వారోత్సవాలలో భాగంగా మొదటి రోజున స్థానిక వి. కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్థానిక యం. డి. హెచ్ ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ అధినేత యం. డి. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఉత్తేజ పూర్వకంగా కోకో, కబడ్డీ, వాలీబాల్, మ్యూజికల్ చైర్స్, రంగోలి ఇతర పలు రకాల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో మంచి ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తున్నట్లు యం. డి. పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం, సంస్థ సభ్యులు రోహిత్ కుమార్, హేమంత్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్