బలవంతపు చేరికలు మానుకోండి టిడిపి హెచ్చరిక

8269చూసినవారు
టిడిపికి కంచుకోట లాంటి కొలమాసనపల్లి పంచాయతీ అయ్యం రెడ్డిపల్లి గ్రామం నుండి సుమారు 20 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి బలవంతంగా కండువా కప్పి ఆహ్వానించినట్లు అయ్యం రెడ్డిపల్లి వాసులు మీడియా సమావేశంలో తెలిపారు. వారి సమాచారం మేరకు ఆదివారం రోజున ఎద్దుల పండుగకు అనుమతుల కోసం ఎమ్మెల్యే వెంకటే గౌడ దగ్గరకు వెళితే అక్కడున్న కొంతమంది వైసీపీ స్థానిక నేతలు మాకు బలవంతంగా పార్టీ కండువా కప్పి, మేము జగన్ మోహన్ రెడ్డి పాలన మెచ్చి వైసీపీలోకి వచ్చినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మేము ఇష్ట పూర్తిగా పార్టీలోకి వెళ్లలేదని సమావేశంలో తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తామని జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులకు క్షమాపణలు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మాజీ సర్పంచ్ సెల్వ రాజు వ్యక్తిగత ఇష్టంతో పని లేకుండా బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం అమానుషమని, ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్